Saturday, July 25, 2026
E-PAPER
Homeమానవిపిల్లల మనసు తెలుసుకోవాలి

పిల్లల మనసు తెలుసుకోవాలి

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్నా ఎలా ఉన్నావు? నిన్ను త్వరలో చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటే నీకు కొంచం విశ్రాంతి ఇచ్చిన దాన్ని అవుతాను. ఎందుకంటే ఈ మధ్య సెలవు రోజుల్లో, సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పని చేస్తున్నావు. నేను వస్తే నీకు ఇంటి పని, వంటపని ఉండదు కదా! ఇక్కడ వాతావరణం కాస్త చల్లబడింది. సరే ఒక విషయం నీతో పంచుకుందామని అనిపించింది. ఈ మధ్య జరిగిన ఒక ఘటన నా మనసుని ఎంతో కదిలించి. కొద్దిజుల కిందట పేపర్లో వచ్చిన రెండు సంఘటనలు మనసుని బాగా కలచి వేసాయి. పిల్లలు ఎందుకు ఇలా తయారు అవుతున్నారు? తల్లి తండ్రులను చంపటం, పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని లోయలోకి తోసి చంపటం. ఇలాంటి దారుణానికి ఎందుకు ఒడికడుతున్నారు. బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాకపోతే ఒక పాఠం నేర్చుకున్నాం.. అంతే. ఒకరిని చంప్రియమైన వేణు గీతికకుపే హక్కు ఎవరికీ లేదు. ఇష్టం లేనప్పుడు కచ్చితంగా చెప్పేయాలి. నిశ్చితార్థం అయినా సరే, ధైర్యంగా తెలియచేయాలి.

తల్లి తండ్రులు కూడా పిల్లల వైపు నుంచి కూడా ఒక సారి ఆలోచించాలి. ఇవ్వాళ పేపర్లో ఒక న్యూస్.. భార్య భర్తలు ఇద్దరూ డాక్టర్లే. భార్య భర్తని కత్తితో పొడిచి చంపేసింది, కొడుకుని కత్తితో పొడిచింది. ఆ బాబు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజలతో మమేకమయ్యే వారుకూడా ఇలాంటి దారుణాలకు ఒడికడుతు న్నారు. దీనికి కారణం కోపం, ఆవేశం. వీటిని కాస్త పక్కనపెడితే జీవితంలో కొంత వరకు సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అనుకుంటున్నాను. ఒక మనిషితో కలిసి ఉండలేనప్పుడు వారికి దూరంగా వెళ్లిపోవడమో విడిపోవడమో మంచిది. ఎందుకంటే కనీసం ప్రాణాలతో అన్నా ఉంటారు కదా! సరే నాన్న మనసు అంత గజిబిజిగా ఉండటంతో ఏమిటో రాశాను. కానీ అవసరమైన విషయాలే రాశానని అనుకుంటున్నా. ఏది ఏమైనా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారి మనసు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఉంటాను బంగారు తల్లి…

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -