Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకు మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అర్హులైన ఎంతోమంది నిరుపేదలు రేషన్ కార్డు కోసం అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్కరికి కూడా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను ఇవ్వలేదని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగానే ఎంతోమందికి కొత్త రేషన్ కార్డులు అందుతున్నాయని, వారికి సన్న బియ్యం కూడా అందించడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం అందించడంతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులను మంజూరు చేసి, సన్న బియ్యాన్ని పంపిణీ చేసిందని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు  కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad