హార్దిక్ పాండ్యకు రూ.12 లక్షల ఫైన్
ముంబయి : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ టిమ్ డెవిడ్‌పై భారీ జరిమానా పడింది. ఆదివారం వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ల సూచనలను టిమ్ డెవిడ్ రెండు సార్లు బేఖాతరు చేశాడు. దీంతో ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డెవిడ్‌పై రూ. 24 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లో బాల్‌ను అంపైర్లు మార్పు చేశారు. మార్పు చేసిన బంతిని ఎగిరేసిన డెవిడ్ అంపైర్లు అడిగినా బంతిని వారికి ఇవ్వలేదు. ఇన్నింగ్స్ 19.2 ఓవర్లోనూ డెవిడ్ అంపైర్ చెప్పినా బంతిని వెనక్కి ఇవ్వలేదు. ఈ సీజన్లో డెవిడ్కు ఇది తొలి తప్పిదం కావటంతో రూ.24 లక్షల జరిమానాతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ విధించారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షలు కోల్పోయాడు. స్లో ఇన్నింగ్స్ రేట్ కారణంగా ముంబయి కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత పడింది.
డెవిడ్‌పై రూ.24 లక్షల జరిమానా
- Advertisement -
- Advertisement -



