Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దఏడ్గిలో ఉపాధి హామీ కూలీలకు నీటి వసతి కల్పించిన సర్పంచ్

పెద్దఏడ్గిలో ఉపాధి హామీ కూలీలకు నీటి వసతి కల్పించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి జిపి గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు నీటి వసతిని కల్పించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉపాధి హామీ పనులను స్థానిక టెక్నికల్ అసిస్టెంట్ సుభాష్ తో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఉదయం పూట చల్లటి సమయంలోనే పనులకు హాజరుకావాలని ఎండలు వేడెక్కాక ముందే పనులను ముగించుకొని 10 గంటల లోపు ఇంటికి వెళ్ళవచ్చని సూచించారు.

వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రతి ఒక్కరు పాటించాలని తమ ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకు ప్రతి ఒక్కరు కట్టుబడి కూలి పనులు చేస్తున్న స్థలంలో నీటి సదుపాయంతో పాటు నీడను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నర్సరీలో పెంచుతున్న ముక్కలకు నిత్యం రెండు పూటలు నీటిని తప్పక అందించాలని సర్పంచ్ ఫీల్డ్ అసిస్టెంట్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ తో పాటు జిపి కార్యదర్శి రమేష్ చారి ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్ , జిపి వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -