- Advertisement -
– మంత్రి దామోదర రాజనర్సింహకు టీటీజీడీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాధారణ, ప్రత్యేక బదిలీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం (టీటీజీడీఏ) కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం సెక్రెటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల తదితర నాయకులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెరిఫెరియల్ జిల్లాల మెడికల్ కాలేజీల అలవెన్స్, పదోన్నతులు, నియామకాలు, కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీం (సీఏఎస్) తదితర సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు నాయకులు తెలిపారు.
- Advertisement -



