Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీడిత ప్రజానీకం కోసం పోరాడిన 'నూర్జహాన్‌'

పీడిత ప్రజానీకం కోసం పోరాడిన ‘నూర్జహాన్‌’

- Advertisement -

– విచ్ఛిన్నకర శక్తుల వ్యతిరేక పోరాటమే ఆమెకు నివాళి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– కార్మికవర్గ ఐక్యత.. పోరాటాలకు సింబల్‌ : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– సంస్మరణ సభలో జోహార్లు అర్పించిన నేతలు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘పీడిత, తాడిత ప్రజానీకం కోసం నూర్జహాన్‌ ఎన్నో ప్రజా పోరాటాలు నడిపారు. కార్మిక వర్గ ఐక్యత కోసం నిలబడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల జీవితాలపై దాడి చేస్తూ కట్టుబానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చింది. సంఘం పెట్టుకోకుండా, పోరాటాలు చేయకుండా, హక్కుల గురించి ప్రశ్నించకుండా వెట్టిచాకిరీ చేయించాలని చూస్తోంది. ఈ క్రమంలో కార్మికులు, సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయకుండా కులం, మతం పేరిట ప్రజలను, కార్మికులను చీల్చుతోంది. కార్మికవర్గ ఐక్యతకు, పోరాటాలకు నూర్జహాన్‌ సింబల్‌. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఆమె కు అర్పించే నివాళి’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. సీఐటీయూ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ సంస్మరణ సభ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. సీఐటీయూతోపాటు ప్రజాసంఘాల నాయకులు, వివిధ రంగాల కార్మికులు హాజరై ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.

సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్‌గౌడ్‌ అధ్యక్షత వహించగా.. పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. నూర్జహాన్‌ అతిచిన్న వయసులోనే పోరాటంలో పరుగులు పెడుతూ అభాగ్యులకు, దోపిడీకి గురవుతున్న వారికి అండగా నిలిచిన ధృవతార అని కొనియాడారు. భౌతికంగా ఆమె లేకపోవడం ఇటు సీఐటీయూకు అటు ఆమె కుటుంబానికి తీవ్ర లోటు అని చెప్పారు. ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు నడిచారని, ఫలితం వచ్చే వరకూ పోరాటం చేసిన ధైర్యశీలి, దీశాలి అని కొనియాడారు.

కీలక సమయంలో దూరం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
కీలకమైన సమయంలో ప్రజా ఉద్యమ నాయకురాలు నూర్జహాన్‌ మనకు దూరమయ్యారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. అమె రికా సామ్రాజ్యవాద యుద్ధాలతో మన దేశంలోనూ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయని, అదేమీ పట్టని మోడీ మాత్రం అలరు బలరు అంటూ అంబానీ, అదానీ ప్రయోజనాలు కాపాడేందుకు తాపత్రయపడుతు న్నారని అన్నారు. మరోవైపు కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులపై నిరంకు శత్వంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. దీనికి తోడు మతం పేరుతో వైషమ్యాలు పెంచుతూ కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి కీలక సమయంలో నూర్జహాన్‌ మన నుంచి దూరమయ్యారని అన్నారు. దోపిడీ వ్యవస్థ పోవాలి.. సోషలిస్టు సమాజం కావాలని తొలి నుంచీ నూర్జహాన్‌ కోరుకు న్నారని, అది ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని పూర్తిగా విశ్వసించినట్టు తెలిపారు. తాను మహిళ అని ఏనాడూ వెనుకడుగు వేయలేదని, ఎక్కడ.. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎర్రజెండాతో కొట్లాడేవారని గుర్తు చేశారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ఆమె బాట మన ముందుందని, ఐక్య పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే నూర్జహాన్‌కు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఒంగూరు రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రమేశ్‌బాబు, వృత్తి దారుల సంఘం కన్వీనర్‌ పెద్ది వెంకట్‌రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్‌, ఆశ, అంగన్‌వాడీ, బీడీ, మెడికల్‌ రిప్స్‌, టీఎస్‌యూటీఎఫ్‌, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ తదితర రంగాల కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

బాల్యం నుంచే పోరాటాలు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రమ
నూర్జహాన్‌ బాల్యం నుంచే పోరాటాల బాట పట్టారని, చివరి వరకు వామపక్ష పోరాటాల్లో భాగస్వామ్యం అయ్యారు. నిషేధిత సంస్థలో పనిచేస్తూ, కనిపిస్తే కాల్చివేసే పరిస్థితుల్లోనూ పోరాటాలు చేపట్టారని తెలిపారు. మైనారిటీ కుటుంబంలో పుట్టినప్పటికీ యావత్‌ కార్మికవర్గం కోసం బురఖా ముసుగును ఛేదించుకొని వచ్చారని కొనియాడారు.

పెద్దఎత్తున పోరాటాలే నివాళి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి
నూర్జమాన్‌ చాలా చిన్నవయసులో మనకు దూరమైంది. అందుకే తీవ్రమైన బాధ. అనారోగ్యంగా ఉన్నా.. అంగన్‌వాడీ, ఆశాల పోరాటంలో ఉండాలని, అధికారులను ప్రశ్నించాలని ఆమె భావించేవారు. కార్మికులు, ఉద్యమం, కష్టాలే ఆమె మదిలో ఉండేది. అందుకే నూర్జహాన్‌కి అంత గుర్తింపు. మన హక్కులు మనం సాధించుకోవాలంటే పోరాటాలే శరణ్యం.

రెపరెపలాడే ఎర్రజెండాలో.. : వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రిప్రసాద్‌
‘పోరాటం, ఐక్యత.. ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ సీఐటీయూ నినాదా లని, అందుకు తగ్గట్టు ఐక్య పోరాటాలు చేపట్టిన నాయకురాలు నూర్జహాన్‌ను కోల్పోవడం బాధాకరం. ఎస్సీ, ఎస్టీ జనాభాకనుగుణంగా నిధులకోసం రాఘవులు ఆధ్వర్యంలో పోరాటం చేపడితే జిల్లా నుంచి హాజరైన ఏకైక నాయకురాలు నూర్జహాన్‌. ఆ పోరాటంతోనే ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయి. రెపరెపలాడే ఎర్ర జెండాలో నూర్జహాన్‌ ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -