Saturday, April 18, 2026
E-PAPER
Homeబీజినెస్వేదాంత గ్రూప్‌ చైర్మెన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

వేదాంత గ్రూప్‌ చైర్మెన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

- Advertisement -

నోయిడాలో బాయిలర్‌ పేలుడు ఘటనలో 20 మంది మృతి కేసులో
సిగింతరయ్:
శక్తి జిల్లాలోని వేదాంత పవర్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన కేసులో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు గురువారం వేదాంత గ్రూప్‌ చైర్మెన్‌ అనిల్‌ అగర్వాల్‌, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. సింగితరారు గ్రామంలోని వేదాంత ప్లాంట్‌లో ఏప్రిల్‌ 14న బాయిలర్‌ నుంచి టర్బైన్‌కు అధిక పీడనంతో కూడిన ఆవిరిని తీసుకు వెళ్తున్న స్టీల్‌ ట్యూబ్‌ పగిలి పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. దీనిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద దాభ్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు శక్తి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రఫుల్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, మతుల పోస్ట్‌మార్టం నివేదికలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల , పారిశ్రామిక ఆరోగ్య, భద్రతా విభాగం నుంచి పలు నివేదికలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -