– మరిన్ని సమావేశాలు జరగాలి : సీఎస్ రామకృష్ణారావు
– సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ, రైల్వే అధికారుల భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేల మధ్య సంబంధాలు, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య తొలి సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజరు కుమార్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు ఇతర రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్ వివిధ శాఖల ప్రధాన అధిపతులు, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల డివిజన ల్ రైల్వే మేనేజర్లు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్యూబీ), రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ ), కొత్త రైలు మార్గాల నిర్మాణం, స్టేషన్ల అభివద్ధి, స్టేషన్లకు అనుసంధాన మార్గాలు తదితర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డు అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనుల మంజూరు, అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయంపై విస్తత చర్చ జరిగింది. ఎన్ఓసీలు, భూసేకరణ, ట్రాఫిక్ మళ్లింపు, విద్యుత్ లైన్లు, పైప్లైన్ల తరలింపు తదితర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని రైల్వే అధికారులు కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని కొత్త రైల్వేలైన్లపై కూడా అధికారులు చర్చించి వాటికి సంబందించిన భూసేకరణ , వ్యయ భాగస్వామ్యం మొదలైన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నరు పూణేతో కలిపే హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను కూడా అధికారులు సమీక్షించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజరు కుమార్ శ్రీవాస్తవ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివద్ధికి కూడా దోహద పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే మద్దతు ద్వారా ఈ ప్రాజెక్టుల వేగం మరింతగా పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్నందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బందానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణ రావు మాట్లాడుతూ ఇలాంటి నిర్మాణాత్మక సమావేశాలు మరిన్ని జరగాల్సిన ఆవశ్యకతను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేల మధ్య సన్నిహిత సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రాభివద్ధికి వివిధ శాఖల మధ్య సమగ్ర ప్రణాళిక. సహకారం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేల మధ్య నిరంతర సంప్రదింపులు , పరస్పర అవగాహన ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు.
సమన్వయంతో పని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



