- Advertisement -
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి… రాధాకృష్ణన్కి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. దేశ తొలి ఉపరాష్ట్రప తిగా సేవలందించారన్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -



