నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే, మరుపురాని రోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించిన సందర్భమని తెలిపారు. నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐక్యమత్యంతో, సాహసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు ప్రకటించారు.
ప్రజాస్వామ్య విజయం : పొంగులేటి
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుందనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తులు ఏకమైతే ఎలాంటి దురుద్దేశపు చట్టాలనైనా అడ్డుకోవచ్చని ఈ పరిణామం స్పష్టం చేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే దూరదృష్టి నాయకత్వంలో విపక్షాలు ఒకటిగా నిలబడి దేశానికి ఒక జాతీయ విపత్తును తప్పించాయని వివరించారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



