సస్పెండైన సభ్యుల వాదనలు వినలేదని పోడియం వద్ద నిరసన
సభా సాంప్రదాయాల ప్రకారమే చర్యలు: చైర్మెన్ గుత్తా
రెండు వాయిదా తీర్మానాల తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
శాసన మండలి మూడో రోజు సమావేశం బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్య ప్రారంభమైంది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమ సభ్యులు తాతా మధు, నవీన్‌రెడ్డిలను అక్రమంగా సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ఎర్రబెల్లి ఫాంహౌస్ వద్ద దళితులు నిరసన తెలిపిన స్థలాన్ని సంప్రోక్షణ చేయడాన్ని ఖండించిన మంత్రి పొన్నం సభలో చర్చ జరగాలని కోరారు. సభ్యులు మహేశ్‌కుమార్ గౌడ్ ఒక వైపు మాట్లాడుతుండగానే, బీఆర్‌ఎస్ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా లెక్కచేయలేదు. సభ్యుల వాదనలు వినకుండా ఎలా సస్పెండ్ చేస్తారనీ, సభా సాంప్రదాయాలకు విరుద్దమని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ మెంట్ సభ్యులుగా ఉన్న పొన్నంతో పాటు తనను ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే సస్పెండ్ చేశారనీ, తాను సభ నిబంధనలు ఉల్లంఘించలేదని చైర్మెన్ గుత్తా తెలిపారు. సంతృప్తి చెందని బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు చెప్పారు. స్పెషన్ మెన్షన్, పిటిషన్లలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్న మైనార్టీ శాఖ మంత్రి అజారుద్ధీన్ ఆయా శాఖలకు నివేదిస్తామని వెల్లడించారు. మహిళా సభ్యుల పట్ల దరుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ బీఆర్‌ఎస్ పక్ష నేత మధుసూధనాచారి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపై సభలో చర్చ జరగాలని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు. అనంతర సభ గురువారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



