Thursday, September 10, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు కేటీఆర్‌ నివాసంలో కీలక సమావేశం

నేడు కేటీఆర్‌ నివాసంలో కీలక సమావేశం

- Advertisement -

‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌‌ నార్సింగిలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కె తారక రామారావు (కేటీఆర్) నివాసంలో గురువారం కీలక సమావేశం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో అల్పాహార సమావేశం నిర్వహిస్తారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌‌కుమార్‌‌రెడ్డిల సస్పెన్షన్‌, అసెంబ్లీలో బుధవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ‌సస్పెన్షన్‌తోపాటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. బీఆర్‌ఎస్‌ ‌మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై దాడి అంశంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశమున్నది. ఆరు గ్యారంటీలు, హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి చర్చ జరగనుంది. 22ఏ నిషేధిత భూముల జాబితా, పాలిటెక్నిక్‌ ‌విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న 97 జీవో, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌బకాయిలు, ఉద్యోగుల సమస్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్‌ ‌కార్యాచరణను రూపొందించే అవకాశమున్నది.
స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌‌పై బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీల వ్యాఖ్యలతో ఇప్పటికే ఆ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్నుంచి బయటపడి ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -