Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశాసనసభను అభాసు పాల్జేస్తున్న కాంగ్రెస్‌

శాసనసభను అభాసు పాల్జేస్తున్న కాంగ్రెస్‌

- Advertisement -

ఇష్టాగోష్టిలో మాజీ మంత్రులు తలసాని, జగదీష్‌‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శాసనసభను అభాసుపాలు చేస్తున్నదని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, జగదీష్‌‌రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరబాద్‌‌లోని అసెంబ్లీ లాబీల్లో వారు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్టంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ మొదటి రోజు గేటు బయట డ్రామా నడిపించారని ఎద్దేవా చేశారు. రెండో రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద డ్రామా నడిపించారని విమర్శించారు. మర్కూక్ మండలంలో కేసీఆర్‌ చావు కోరుకున్న ఎమ్మెల్యే సభలో ఉన్నా‌రని, అలాంటి వారిని సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తిరుపతిలో ఉన్న మల్లారెడ్డిని, సభలో లేని కేటీఆర్‌‌, గూడెం మహిపాల్‌‌రెడ్డిని సస్పెండ్ చేయడం అవివేకమని తెలిపారు.
22ఏ అంశం జీవో 97 చర్చకు రాకుండా ప్రభుత్వం నాటకమాడు తున్నదని విమర్శించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ అసెంబ్లీ మొదటి రోజు తాము నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా తమకు దెబ్బలు తగిలాయని, దాని గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ అమ్మ, వాళ్ల అక్కల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.
తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నాటకాలాడుతున్నదని విమర్శించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్‌ ‌విచారం వ్యక్తం చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -