– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈనెల 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నుండి 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వరకు మనువాదానికి వ్యతిరేకంగా “రాజ్యాంగ హక్కులను కాపాడుకుందామనే ” నినాదం గ్రామ గ్రామాన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రచారాలను నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య భవన్, భువనగిరిలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో రాజ్యాంగం, రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను, మత స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని , లౌకిక తత్వాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసి చట్టంలో ఉన్న ముఖ్యమైన వాటిని ఎత్తివేసి మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలనే నీచమైన ఆలోచనలను బిజెపి ప్రభుత్వం చేస్తున్నదని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. ఎంతో చరిత్రగల్ల భారతదేశం భిన్నమతాలకు, భిన్నసంస్కృతులకు నిలయంగా ఉన్నదని ఆనాడు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు కులవివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా అందరూ సమాన హక్కులను పొందాలని, అందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం రావాలని అనేక ఉద్యమాలు చేశారని, చట్టాలు కూడా తీసుకొచ్చారని, రాజ్యాంగాన్ని రూపొందించారని అలాంటి మహానుభావుల స్ఫూర్తిని వారు తీసుకొచ్చిన చట్టాలను మతోన్మాద మనువాద బిజెపి మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలపైన, వారు తిని తిండిపైన, సంస్కృతి పైన, కల్చరల్ పైన దాడులు నిర్వహిస్తుందని ఆవేదన వెలిబుఇచ్చారు. ఈ విధానాలను గ్రామీణ స్థాయి ప్రజలదాకా తీసుకపోయి వాటిని ఎండగట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తిని కిందిదాకా తెలియజేయడానికి మహానుభావుల యొక్క జయంతీల సందర్భంగా వాడవాడనా ఉత్సవాలు నిర్వహించాలని నర్సింహ కోరారు. అనంతరం సీపీఐ(ఎం) భువనగిరి మండల పూర్వపు కార్యదర్శి, ఐలు యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి, అనాజిపురం గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ బొల్లెపల్లి కుమార్ భువనగిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, కొండ అశోక్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు బొల్లెపల్లి లీల, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, కళ్లెం లక్ష్మీ నరసయ్య లు పాల్గొన్నారు.