నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉందని నిజామాబాద్ జిల్లా ఐద్వా కార్యదర్శి సుజాత ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కమిటీ సభ్యురాలు వనజ ధర్పల్లి మండలంలో జరిగినటువంటి అనూష హత్య కేసులో పూర్తి సమాచారం స్వీకరించడం కోసం ధర్పల్లి మండలం వెళ్లడం జరిగింది. ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. మహిళలకు ఇంట్లో బయట రక్షణ లేకపోవడం కాకుండా పోలీసు వ్యవస్థ మహిళలకు రక్షణ కల్పించడం మానేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం వల్లనే హత్యలు అత్యాచారాలు దాడులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. అనూష హత్య కేసులో నిందితుడైనటువంటి వినోద్ కుమార్ రిమాండ్ కు పంపకుండా నిందితుడిని కాపాడే విషయంలో ధర్పల్లి పోలీసులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. డెడ్ బాడీని కూడా కేసు కాంప్రమైస్ చేసుకుంటేనే డెడ్ బాడీ ఇస్తామని సీబీఐ ఆఫీస్ కి తెలిసి కుటుంబ సభ్యుల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి కష్ట పడేవారు పిచ్చి విడిపోవడం జరిగింది . మళ్లీ నేను ఉండలేకపోతున్నాను నీతో కలిసి ఉంతను అని అమ్మాయిని నమ్మించి మంచిగా ఉంటున్నట్టు నటించి దాదాపు 16 లక్షల రూపాయలు డ్వాక్రా గ్రూప్లో లోన్లు తీసుకొని అవి కాకుండా ఇంకో 10 లక్షల రూపాయలు ఇల్లు పై అప్పుచేసి ఈ 15 రోజులుగా అమ్మాయి నువ్వు వడ్డీ డబ్బులు కట్టట్లేదు ఇబ్బంది అవుతుంది అని గట్టిగా అడగడంతో ప్రాణాలు తీసినటువంటి వినోద్ కుమార్ ని రక్షించడం కోసం పోలీసులు తాపత్రయం మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులకు కొమ్ము కాస్తే ఇంకా రక్షణ కల్పించేది ఎవరు అనూష కి వాళ్లిద్దరు పిల్లలకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలో కార్యక్రమాన్ని చేపడతామని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు.