రోడ్డు ప్రమాదాలలో ప్రతి సంవత్సరం 1.68 లక్షలు బలవుతున్నారు: డీటీఓ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ కేంద్రం ట్రినిటీ హైస్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పాఠశాల విద్యార్థులకు జిల్లా రవాణా అధికారి గంట రవీందర్ గురువారం అవగాహన కల్పించారు.గంట రవీందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశం మొత్తం మీద 1.68 లక్షలు ప్రమాదాల ద్వారా చనిపోతున్నారని 4 లక్షల అంగవైకల్యం బారిన పడుతున్నారని పోలీస్ రికార్డు  చెబుతుందని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్,అతివేగం ద్వారా జరుగుతున్నాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీటి పైన తల్లిదండ్రులు విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకు ఆహ్వానం కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కేవీబీ కృష్ణారావు, ప్రిన్సిపల్ U.మంజుల,సందీప్,మహేష్,కరుణాకర్, అనుష తదితరులు పాల్గొన్నారు.
Spread the love