
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19 నుండి రైతు రుణమాఫీ లబ్ధి చేకూరని రైతుల కోసం దరఖాస్తుల స్వీకరణ రైతు వేదికలో ప్రారంభించారు.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాల నుండి శుక్రవారం వరకు వివిధ కారణాలతో రుణమాఫీ అందని రైతుల నుండి 1215 దరఖాస్తులు అందాయని మండల వ్యవసాయాధికారి జి. వెంకటేష్ తెలిపారు.వీటిలో రేషన్ కార్డు లేని, ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాకు సరిపోని, పట్టాదార్ పాస్ బుక్కు లేనటువంటి, బ్యాంకు ఖాతాలో వివిధ సమస్యలతో మరణించిన రైతులు, పెన్షన్ అందుకుంటున్న విశ్రాంత ఉద్యోగులు, పరిశీలనలో ఉన్నటువంటి కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.