హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 37 శాతం పతనంతో రూ.133 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.212.70 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.758.60 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 37.4 శాతం క్షీణించి రూ.474.80 కోట్లకు పరిమితమయ్యింది. 2024-25కు గాను మూడో మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ రూ.2 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.1.50 చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డ్ తేదిని ఫిబ్రవరి 18గా నిర్ణయించింది.