ఈ-చలాన్ల రాయితీ గడువు చివరితేది 15ను సద్వినియోగం చేసుకోవాలి

– ఫిబ్రవరి 15 తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు
నవతెలంగాణ  – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని వాహనాదారులు అందరూ తమ తమ వాహనాలపై గల పెండింగ్ ఈ-చలాన్లను త్వరితగతిన చెల్లించుట కోసం రాష్ట్ర ప్రభుత్వం తేది: 26-12-2023 నుండి పెండింగ్ ఈ-చలాన్ల పై రాయితీ కల్పించడం జరిగింది. అట్టి రాయితిని ఈ నెల తేదీ 15-2-2024 వరకు రాయితీని చెల్లించుటకోసం గడువు తేదీని పొడిగించడం జరిగింది. అని కావున వాహనాదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సోమవారం ప్రకటనలో తెలియజేశారు. ద్విచక్ర వాహనాలపై త్రి విల్లర్సుపై 80శాతం రాయితీ, ఆర్.టీ.సీ వాహనాలకు 90 శాతం రాయితీ, లైట్ మోటారు వాహానాలకు మరియు భారీ వాహనాలకు 60 శాతం వరకు రాయితీ కలదు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో రాయితీ ముగిసిన తేది తర్వాత పెండింగ్ లో ఉన్న ఈ-చలాన్ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. కావున వాహనాదారులు ప్రభుత్వ రాయితీని సద్వి నియోగపర్చుకోగలరు. పెండింగ్ ఈ-చలాన్లు చెల్లించని వారికి మోటారు వాహనాలచట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున వాహనాదారులు సంబందిత పోలీస్ సిబ్బందికి సహకరించగలరు అని తెలియజేశారు.
Spread the love