17 శాతం హెచ్ ఆర్ఎ ను చెల్లించాలి

17 percent HRA has to be paidనవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ నగర కార్పొరేషన్ సరిహద్దు నుండి 8 కి.మీ. ల పరిధిలో ఉన్న గ్రామాలు, తండాలకు 17శాతం హెచ్ ఆర్ ఏ అమలు చేసే క్రమంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల  జాబితాలో  కొన్ని చేర్చలేదు అని,  వాటిని కూడా జాబితా లో చేర్చాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి టీఎస్ యుటిఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మాక్లూర్ మండలం లోని ఆమ్రాదు తండా, మదన్ పల్లి తండా, సట్లాపూర్ తండా, గద్వాల్ క్యాంపు, వేణు కిసాన్ నగర్, ఒడ్డెర కాలనీ (మామిడిపల్లి ), జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి, డిచ్ పల్లి మండలం లోని వెస్లీ నగర్ లకు 17 శాతం ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ ఆర్ ) చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. సత్యానంద్, ఓ. రమేష్, జిల్లా ట్రెజరర్ ఎమ్.మల్లేష్, జిల్లా కార్యదర్శులు ఎమ్. జనార్దన్, వి. సాయన్న పాల్గొన్నారు.
Spread the love