– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ కులాలకు జనాభా ప్రాతిపదికన 20 శాతం రిజర్వేషన్ పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అయన లేఖ రాశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 86 మండలాల్లో 10 లక్షలకు పైగా ఎస్సీ జనాభా ఉందని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచా యతీ రాజ్ చట్టంతో ఆయా జిల్లాల్లోని జడ్పీటీసీ, ఎంపిటిసీ, వార్డు సభ్యులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన రెవెన్యూ చట్టంతో వారి సాగుభూములకు మ్యానువల్ పహానీల ద్వారా పంట రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.