తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2021 -2024 సంవత్సరం డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి గురువారం తన చాంబర్ లో పరీక్ష నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 8930 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 44.41శాతం విద్యార్థులు అనగా 3966 మంది ఉత్తీర్ణులయ్యారు.ఇందులో బాలురకు 27.93 శాతం కాగా బాలికలు 55.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్,డాక్టర్ సాయిలు, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి పి.ఆర్వో డాక్టర్. ఏ.పున్నయ్య, ప్రోగ్రామర్లు సతీష్,విజయ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.