రెండు నియోజకవర్గాల్లో 273 ధాన్యం సెంటర్లు: ఆర్డీవో రాజా గౌడ్

నవతెలంగాణ – ఆర్మూర్
బాల్కొండ, ఆర్మూర్  నియోజకవర్గాలలోని మొత్తం 13 మండలాల్లో 273 ధాన్యం సెంటర్లను ప్రారంభించడానికి జిల్లా  కలెక్టర్ అనుమతి ఇచ్చారని రెవెన్యూ డివిజనల్ అధికారి  రాజా గౌడ్  శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈనెల 19వ తేదీన ధాన్యం సేకరణ ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో “సన్నాహక సమావేశం” జరిగిందన్నారు. సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love