Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంబెంగళూరులో 31 మంది బంగ్లా వలసదారులు అరెస్ట్!

బెంగళూరులో 31 మంది బంగ్లా వలసదారులు అరెస్ట్!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బెంగళూరు నగరంలో అక్రమంగా నివసిస్తున్న 31 మంది బంగ్లాదేశీయులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిని గుర్తించి, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలించారు. SMVT బెంగళూరు నుంచి 20 మంది పోలీసు సిబ్బంది వీరిని తీసుకెళ్తున్నారు. మాల్దా నుంచి వీరిని బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేయనున్నారు. అనుమానిత వ్యక్తులపై దృష్టి సారించి బెంగళూరు పోలీసులు ‘ఆపరేషన్ ముక్త’ చేపట్టారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -