Monday, August 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహైడ్రోప‌వ‌ర్ ట‌న్నెల్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు

హైడ్రోప‌వ‌ర్ ట‌న్నెల్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ వ‌ర‌ద‌ల్లో ర‌సువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ హైడ్రోప‌వ‌ర్ సైట్ వ‌ద్ద ఉన్న ట‌న్నెల్‌లో సుమారు 933 మంది కార్మికులు ఇరుక్కున్న‌ట్లు తెలుస్తోంది. హైడ్రోప‌వ‌ర్ సైట్ వ‌ద్ద ప్ర‌ధాని ఆదేశాల ప్ర‌కారం గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మరం చేసిన‌ట్లు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం పేర్కొన్న‌ది. జేసీబీల ద్వారా సుమారు 10 మీట‌ర్ల గొయ్యిను ఓ ప్ర‌దేశంలో తొవ్వారు. బుర‌ద‌, రాళ్లతో నిండిన ప్ర‌దేశాన్ని నేపాలీ ఆర్మీ శుభ్రం చేస్తున్న‌ది. త్రిశూలీ-3ఏ ట‌న్నెల్‌లోకి ప్ర‌వేశించేందుకు క్లీనింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ట‌న్నెల్ రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం విదేశీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టుల వ‌ద్ద ఉన్న ట‌న్నెల్స్‌ను లొకేట్ చేసి, వాటిల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. ర‌సువాగాధీ హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టులో ఆర్మీ సిబ్బంది వెళ్లారు. కానీ ఎవ‌ర్నీ గుర్తించ‌లేక‌పోయారు. డ్రోన్ల సాయంతో టన్నెల్స్‌ను ప‌రీక్షిస్తున్నారు. అప్ప‌ర్ త్రిశూలీ 1, త్రిశూలీ 3ఏ, త్రిశూలీ 3బీ ట‌న్నెల్స్‌లోనూ సెర్చ్ ఆప‌రేష‌న్స్ కొన‌సాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -