448328 మంది ఓటు వేయలే

– ఓటర్ కార్డును గుర్తింపు కార్డుగానే భావిస్తున్న కొందరు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్ధులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. మన ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే ధోరణి లోనే ఉన్నారు. సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 448328 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నల్గొండ  జిల్లా వ్యాప్తంగా మొత్తం 1725465 మంది ఓటర్లు ఉండగా 1277137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జిల్లాలో 4.40 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండటానికి కారణాలను యంత్రాంగం పరిశీలిస్తోంది. ఓటర్ల పండగ లాంటి కార్యక్రమాలు, చైతన్య సదస్సులు 2కె,5కె  రన్  వంటివి నిర్వహించి ఓటర్లను చైతన్య పరిచారు. నల్గొండ  జిల్లాలోహుజూర్నగర్  నియోజకవర్గంలో  అత్యధికంగా 191945 ఓట్లు పోలవగా, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 173334  పోలవడం గమనార్హం. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. ఓటరు కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే చాలా మంది ఉపయోగిస్తున్నారనేది స్పష్టమవుతోంది.
నల్గొండ జిల్లాలో  అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా…నియోజకవర్గంలో  మొత్తం ఓట్లు పోలైనవి, వేయనివారు వివరాలు ఇలా ఉన్నాయి…
దేవరకొండ నియోజకవర్గంలో  మొత్తం ఓటర్లు 262480, ఓట్లు పోలైనవి 185310, ఓటు వేయను వారు 77170 మంది ఓటర్లు. అదేవిధంగా నాగార్జునసాగర్ లో మొత్తం ఓటర్లు 236484, పోలైనవి 176190, ఓటు వేయని వారు 60294, మిర్యాలగూడలో మొత్తం ఓటర్లు 236343, పోలైనవి 173334, ఓటు వేయని వారు 63009. హుజూర్నగర్  లో  మొత్తం ఓటర్లు 251444, పోలైనవి 192945, ఓటు వేయని వారు 59499. కోదాడలో మొత్తం ఓటర్లు 245187, పోలైనవి 184415, ఓటు వేయని వారు 60772. సూర్యాపేటలో మొత్తం ఓటర్లు 244116, పోలైనవి 178378, ఓటు వేయని వారు 65738. నల్లగొండ నియోజకవర్గంలో  మొత్తం ఓటర్లు 1725465, పోలైనవి 187565, ఓటు వేయని వారు 61846 మంది ఓటర్లు ఉన్నారు.
Spread the love