గట్ ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి కీలకం అయినప్పటికీ, చాలా మంది దీన్ని అనుసరించరు. తప్పుడు ఆహార అలవాట్లు గట్ మైక్రోబయోమ్‌ను దెబ్బతీసి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ట్రిలియన్ల బ్యాక్టీరియాలు అంటే గట్‌మైక్రోబయోమ్ ఆహారాన్ని జీర్ణించుకోవడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి. కానీ, కొన్ని ఆహారపు అలవాట్లు గట్ బాక్టీరియాను అసమతుల్యతకు గురిచేస్తాయి. ఇది జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. అందువల్ల, మనం తినే ఆహారం గట్ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకుని, సరైన పోషక ఆహార మార్గదర్శకాలను అనుసరించడం చాలా ముఖ్యం.
గట్‌మైక్రోబయోమ్ అనేది శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి, ముఖ్యమైన విటమిన్లను ఉత్పత్తి చేసి, మెటాబాలిజాన్ని నియంత్రించేలా పనిచేస్తాయి. సమతుల్య గట్ బాక్టీరియా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, శరీరంలో వాపు (inflammation) తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తుంది. కానీ, అసమతుల్య గట్ బాక్టీరియా వల్ల గ్యాస్, మలబద్దకం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS),, ఊబకాయం, మధుమేహం, డిప్రెషన్ వంటి సమస్యలు రావచ్చు.
గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు
1. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్: అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. ఇది గట్‌బాక్టీరియా అసమతుల్యతను కలిగించి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
2. తక్కువ ఫైబర్ సేవించడం: ఫైబర్ గట్‌బాక్టీరియాకు ముఖ్యమైన ఆహారం. తక్కువ ఫైబర్ తీసుకుంటే మలబద్దకం, జీర్ణ సమస్యలు, గట్‌మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడతాయి.
3. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ అధికంగా వాడటం: ఆస్పార్టేమ్, సుక్రలోస్ వంటి కత్రిమ చక్కెర పదార్థాలు గట్‌లో ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
4. భోజనానికి సమయపాలన లేకపోవటం: భోజనం స్కిప్ చేయడం, లేదా భోజన సమయాలు పాటించకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ రిథమ్ దెబ్బతింటుంది. ఇది పోషకాల శోషణం (absorption) తగ్గడానికి, గట్‌మైక్రోబయోమ్ అసమతుల్యతకు దారి తీస్తుంది.
5. అధిక మద్యం, కాఫీన్ తీసుకోవడం: మద్యం, అధిక కాఫీన్ వల్ల గట్లైనింగ్ నశించిపోతుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరిగి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక ఆహారాలు
1. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి: ధాన్యాలు, పిండి, పండ్లు, కూరగాయలు తినడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
2. ప్రోబయోటిక్ ఆహార పదార్థాలను చేర్చుకోవాలి: పెరుగు, లస్సీ, బాజ్రా రోటీ, పెరుగు, ధోఖ్లా (Dhokla),, ఇడ్లీ, దోస, ఉత్తపం వంటి ఫెర్మెంటెడ్ ఆహార పదార్థాలు మంచి చేసే బ్యాక్టీరియాను పెంచుతాయి.
3. తగినన్ని ద్రవాలు తాగాలి: తగినన్ని నీరు తాగడం వల్ల జీర్ణప్రక్రియను మెరుగుపరిచి, మలబద్దకాన్ని తగ్గించి, గట్‌మైక్రోబయోమ్‌కు రక్షణ కల్పిస్తుంది.
4. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర తగ్గించాలి: ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర తగ్గిస్తే హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
5. నియమిత భోజన సమయాలు పాటించాలి: ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయడం, ఆహారాన్ని బాగా నమలడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. గట్‌బాక్టీరియా సమతుల్యం ఉంటుంది.
గట్‌ఆరోగ్యం మెరుగుపడితే శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ‘ఆరోగ్యకరమైన గట్, ఆరోగ్యకరమైన జీవితం!’. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.
Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314