హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఏడాది విద్యా రుణాల్లో 50 శాతం వృద్ధి నమోదవుతుందని ఆక్సీలో ఓవర్సీస్ లోన్స్ ప్రతినిధి శ్వేతా గురు తెలిపారు. ప్రముఖ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ఎన్బీఎఫ్సీ అయిన ఆక్సిలో ఫిన్సర్వ్ గత 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్ల నుంచి ఏడాదికేడాదితో భారీ పెరుగుదల చోటు చేసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. తమ శాఖల నెట్వర్క్ను విస్తరిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ప్రతీ ఏడాది 65వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారన్నారు.