కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి…

– సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ :  కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రాఘవ ప్లాజా పూలే విగ్రహం వద్ద గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లో అధికారం లో వున్న బిజెపి ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్, రెండు రూపాయలు పెంచి వంట గ్యాస్ ధరలను 50 రూపాయలకు పెరగటం మూలాన పేద ప్రజల పైన భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం వెలిగిపోతుంది పేదరికం లేని దేశంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన సందర్బంగా మాట్లాడిన మాటలు అన్నీ నీటి బుడగల లాగా అయ్యాయని ఆయన అన్నారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచి పేదవారి నడ్డి విరచడమేనా మీరు చెప్పే మాటలు చేసే విధానాలు ఇవే అని ఆయన అన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్న ఈ పరిస్థితులలో వంటగ్యాసు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలను ఇంకొంచెం అణిచివేతకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులకు కార్పొరేట్ శక్తులకు, బడా భూస్వామ్య వ్యవస్థకు తలవంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను అణచివేతకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా, నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల పై మరింత ఆర్థిక భారాన్ని మోపుతూ వున్నారని అన్నారు. పెంచిన వంటగ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. *సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు కొప్పోజు సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, చివేముల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము రేగట్టి లింగయ్య, ఏ ఎల్ వై ఎఫ్ పట్టణ కార్యదర్శి ఎడెల్లి శ్రీకాంత్ ఐతరాజు లింగయ్య, ఎండి పాషా, దేశ గాని హేమలత, శ్రీనివాస్ రెడ్డి, కారింగుల లింగయ్య, మడిపల్లి మనోజ్, వాడపల్లి వెంకన్న, రెడ్డి మల్ల శ్రీనివాస్, రిక్షా కార్మికులు పాల్గొన్నారు.
Spread the love