– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి నియోజకవర్గానికి హెచ్ఎండిఏ నుంచి 56.18 కోట్లు మంజూరైనట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీకి సిసి రోడ్లకు గాను 5.80 కోట్లు, భువనగిరి మున్సిపాలిటీలో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ ఇతర వర్కులకు గాను 7.80 కోట్లు, పోచంపల్లి మున్సిపాలిటీకి 7.90 కోట్ల రూపాయలు, భువనగిరి మండలంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల గాని 9.50 కోట్ల రూపాయలు, బీబీనగర్ మండలానికి 16.08 కోట్ల రూపాయలు, పోచంపల్లి సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 9.10 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.