71 సెల్ ఫోన్ రికవరి చేసి ఇచ్చిన అదనపు పోలీస్ కమీషనర్(అడ్మిన్)..

Additional Commissioner of Police (Admin) recovered 71 cell phones.నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్ లు పోయినవారివి దాదాపు 71 రికవరి చేయడం జరిగింది అని నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ మొత్తం 71 సెల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా రికవరి చేసిన మొబైల్ ఫోన్లను బాధిత యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా అట్టి నంబర్ ను www.ceir.gov.in వెబ్ సైటు లో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందవర్చాలి అని, అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్ ను పట్టుకోవడం జరుగుతుందని కావున ప్రజలు ఈ పద్దతిని సద్వినియోగపర్చుకోవాలని తెలియజేశారు.ఈ విధంగా రికవరి చేసిన సెల్ ఫోన్ లను నేడు పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి  ఆధ్వర్యంలో 71 మందికి అందజేశారు. ఇందులో కృషిచేసిన బి. మాన్ సింగ్,పి.సి 663 బోధన్ టౌన్ పి.యస్., డి. అనుషా మహిళా పి.సి 2704, టౌన్ 1 పి.యస్. ఆర్. సుష్మ, మహిళా పి.సి :2312 ఐ.టి సెల్, లను ప్రశంసా పత్రములు ఇచ్చి అభినందించారు.
Spread the love