ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా నెల్లికుదురు మండలం నుండి 75 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని, 64 మంది విధులకు హాజరయ్యారని సోమవారం ఎంఈఓ గుగులోతు రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఈరోజు మండలం లోని వివిధ గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 75 మంది వేరే పాఠశాలలకు బదిలీ అయి వెళ్ళారు. 64 మంది ఉపాధ్యాయులు నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో సోమవారం విధుల్లో చేరారు అని తెలిపారు.