75 వన మహోత్సవం..

నవతెలంగాణ – డిచ్ పల్లి.
75 వ వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో 1000 ఈత మొక్కలను నాటాడం జరిగిందని భీమ్ గల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్  పి.వేణు మాధవరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సువార్త సిబ్బంది తో కలిసి నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను ప్రతి ఒక్కరూ నాటుకోడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్  ఫయాజ్, కానిస్టేబుల్స్ మహేష్, జగదీష్ తోపాటు గ్రామస్తులు,గౌడ సంఘ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love