మండలంలోని గొల్లపల్లి, పోసానిపేటలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో గురువారం దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల మల్లేష్, మహేష్, నరేష్, లింగం, సత్యం, చెలిమెటి గంగాధర్, పల్లె శ్రీను, నరేష్, రాజలింగం, పల్లె బీరయ్య, ధర్ని మల్లేష్, పల్లె నరేష్, వీడీసీ చైర్మన్ సాకలి సాయిలు, గాండ్ల ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.