- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని దోస్ పల్లి గ్రామంలో శ్రీ స్వామి నరేంద్ర చార్య జీ సంప్రదాయ్ పాండురంగ పటేల్ ప్రవాచకర్ సతీమణి అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన విటమికులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ భర్త నీలు పటేల్, సీనియర్ నాయకులు బొల్లి గంగాధర్, వాస్రే రమేష్ పటేల్, విట్టు పటేల్, కాశినాథ్, స్వామి సంప్రదాయకులు నరేష్ సెట్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -