- Advertisement -
- మేకను ఎత్తుకెళ్లిన చిరుత
– భయబ్రాంతులో మండల వాసులు - నవతెలంగాణ – జుక్కల్
- మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో మేకల మందపై శుక్రవారం అర్ధరాత్రి సమయం తెల్లవారుజామున చిరుత పులి మేకల మంద పై దాడి చేసి ఎత్తుకెళ్లిందని మేకల కాపరులు తెలిపారు. ఈ సమాచారాన్ని గ్రామ సర్పంచ్ కు తెలియజేయగా వెంటనే ఫారెస్ట్ బీట్ అధికారి రాములుని ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను వివరించారు. ఫారెస్ట్ బీట్ అధికారి బృందం సంఘటన స్థలానికి వచ్చి చిరుత సంచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిది అనే విషయాన్ని పరిశీలించారు. పాదం ముద్రలు పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు చిరుత పులి అని తేల్చి చెప్పారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పాదముద్రలను అనుసరిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో గుట్ట ప్రాంతంలో ఒక మేకను నోటితో పట్టుకొని తీసుకెళ్ళిన్నట్టు అనవాళ్లు కనిపించాయని అన్నారు. తరువాయి పాదముద్రలు కనిపించకపోవడంతో పర్వత ప్రాంతంలో దట్టమైన ప్రాంతంలోకి వెళ్లినట్టు మేక లు, పశువుల కాపరులు, గ్రామస్తులకు , గ్రామ సర్పంచ్ కు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసారు . రాత్రిపూట బయటకు వెళ్ళవద్దని చిరుత సంచారం చేస్తున్న దని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అవగాహన నిర్వహించారు. ఇట్టి విషయాన్ని జిల్లా అధికారులకు వివరించి తెలియజేస్తానని పేర్కొన్నారు.
- Advertisement -



