నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కంఠాలి గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సర్వే ను నిర్వహిస్తున్న అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్థానిక నాయకులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ఉన్నారు గ్రామాలలో నిర్వహిస్తున్న సమగ్ర ప్రత్యేక ఓటర్ల సర్వేను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వచ్చిన అధికారులకు సమాచారం ఇవ్వాలని వారికి సహకరించాలని తెలిపారు. వచ్చిన అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసి తెలిపిన పత్రాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో తో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా ప్రక్రియ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మార్వో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



