Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీయో చుక్కలపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన

పోలీయో చుక్కలపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం యందు శనివారం ఆరోగ్య సిబ్బందికి శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో రవీందర్ మాట్లాడుతూ ..0-5 వయస్సు మధ్య వయసుగల పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో, పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా అవగాహన ర్యాలీ కూడా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారిని డాక్టర్ శ్రేయ, కృష్ణమూర్తి, సి హెచ్ ఓ, చంద్రశేఖర్, హెచ్ఇఓ సాయన్న, ఎస్యుఓ, శంకర్ హెచ్ఇ శాంత, హెచ్ ఎస్ దత్తాద్రి, ఆనంద్ ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -