- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని విద్య హైస్కూల్ లో పాఠశాల యాజమాన్యం అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ రఘుపతి హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తీవ్రంగా హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ప్రవీణ్, సామాజిక సేవకులు తులసి పట్వారీ, టీచర్లు,ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



