- Advertisement -
నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలి అని కల్వకుర్తి టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ డొక్కా లింగం శుక్రవారం నవ తెలంగాణతో మాట్లాడారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో ఎంతో కష్టపడ్డా కార్యకర్తలకు ఆయా పార్టీల నాయకులు సర్పంచిగా ఎంపిటిసిగా జడ్పిటిసిగా జడ్పీ చైర్ ర్సన్ గా ఎంపీపీలుగా యువతకు అవకాశం కల్పిస్తే వారు గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవకాశం ఉంటుందని వారు అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగాలలో యువత రాజకీయాల్లోకి రావాలని యువత రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు మారుతుందని చెప్పడం కాదు ఈ మాటను నిజం చేసి చూపాలని వారు డిమాండ్ చేశారు.
- Advertisement -