నవతెలంగాణ-ఆలేరు రూరల్
నైజాం నిరంకుశ పాలన అంత ముందించడమే లక్ష్యంగా పాత్రికేయుడిగా గల మెత్తిన ధైర్యశాలి షోయబుల్లా ఖాన్ కు ఆలేరు ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఆయన ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆలేరు ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఉన్న స్థలంలో మంగళవారం నాడు పాత్రికేయులతో సోయాబుల్లాఖాన్ వర్ధంతి వారోత్సవాలలో భాగంగా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం కుర్షిత్ పాష మాట్లాడుతూ. ముస్లిం అయినా షోయబుల్లాఖాన్ నైజాం నిరంకుశ పాలనకు భయపడకుండా రజాకర్ల దమనకాండను విమర్శిస్తూ అనేక కథనాల ద్వారా సంపాదకీయం ఉర్దూ దినపత్రిక. ఇమ్రేజీ ప్రపంచానికి చాటిన ధైర్యశాలన్నారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి జంపాల దశరథ మాట్లాడుతూ.. హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని ఆయన చేసిన రచనలు నైజం పాలకులకు ఆగ్రహం తెప్పించి 1948 ఆగస్టు 22న రజాకార్లు జరిపిన దాడిలో నేలకొరిగిన గొప్ప పాత్రికేయుడని కొనియాడారు.
ఆయన చరిత్ర ప్రశ్నించే పాత్రికేయులకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మొరిగాడి మహేష్ ముల్లెక్కల రవి కొరుటూరు ఉపేందర్ చందన శంకర్ చింత కింది వెంకటేశ్వర్లు సామల సిద్ధులు మంచాల మల్లేష్ ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు.



