- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీలక్ష్మీ మండల సమాఖ్య నూతన కమిటీని నియామకం చేసినట్లుగా మండల ఐకెపి ఏపీఎం హనుమంతరావు తెలిపారు. మంగళవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలోని శ్రీలక్ష్మీ సమాఖ్య మండల కార్యాలయంలో గ్రామైఖ్య సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వశక్తి మహిళల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం మండల సమాఖ్య సంఘం మండల కమిటీని ఎన్నుకొన్నారు. అధ్యక్షురాలుగా సౌజన్య, కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా సుజాతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు, స్వశక్తి మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



