- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.
- Advertisement -



