- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియమితులయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ నియమితులు కాగా.. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- Advertisement -



