Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు సామాజిక న్యాయ 
తెలంగాణ సంకల్ప సభ

నేడు సామాజిక న్యాయ 
తెలంగాణ సంకల్ప సభ

- Advertisement -

​హాజరు కానున్న10 వేల మంది ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కోసం హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత 10 వేల మంది ప్రతినిధులతో సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడానికి తాము ఎలాంటి ఎజెండా తీసుకుబోతున్నామో కవిత స్పష్టతనివ్వనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో పలువురు ప్రముఖుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -