Friday, June 26, 2026
E-PAPER
HomeజాతీయంAyodhya Ram Temple: ఎఫ్ఐఆర్‌లోని 8 మంది నిందితులు అరెస్టు

Ayodhya Ram Temple: ఎఫ్ఐఆర్‌లోని 8 మంది నిందితులు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య రామాల‌య(Ayodhya Ram Temple) నిధుల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు న‌మోదు అయిన కేసులో 8 మందిని అరెస్టు చేసిన‌ట్లు సీనియ‌ర్ అధికారులు వెల్ల‌డించారు. అవ‌నాశ్ శుక్లా, అనుక‌ల్ప్ మిశ్రా, ల‌వ‌కుశ్ మిశ్రా, మ‌నీశ్ కుమార్ యాద‌వ్‌, క‌రుణేశ్ పాండే, రామ‌శంక‌ర్ మిశ్రా, సుభాస్ శ్రీవాత్స‌వ్‌, రామశంక‌ర్ యాద‌వ్ అలియాస్ టిన్ను ఆ జాబితాలో ఉన్నారు. రామాల‌యానికి విరాళాల రూపంలో అందే న‌గ‌దు, విలువైన‌ వ‌స్తువుల‌ను లెక్కించే ప్ర‌క్రియ‌లో ఆ 8 మంది ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అంద‌రూ అయోధ్య‌లోనే ఉన్నార‌ని, వారిని అదుపులోకి తీసుకున్నామ‌ని, వారిని విచారిస్తున్నామ‌ని, మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు ఓ సీనియ‌ర్ అధికారి చెప్పారు.

శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు కృష్ణ మోహ‌న్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ కేసులో యూపీ స‌ర్కారు ఏర్పాటు చేసిన సిట్ కూడా ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అయితే ఎఫ్ఐఆర్‌లో ఉన్న 8 మందిని గురువారం రాత్రి అరెస్టు చేసిన‌ట్లు ఇవాళ అధికారులు వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -