Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌, బీజేపీ ‌టార్గెట్‌‌ హరీశ్‌‌రావు

కాంగ్రెస్‌, బీజేపీ ‌టార్గెట్‌‌ హరీశ్‌‌రావు

- Advertisement -


మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌మాజీమంత్రి హరీశ్‌‌రావును కాంగ్రెస్‌, బీజేపీలు టార్గెట్‌ ‌చేశాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌‌రావుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాలకు వెళ్తే క్షుద్రపూజలు చేసినట్టు అవుతుందా?అని ప్రశ్నించారు. తమిళనాడు సీఎం విజయ్‌ ‌కూడా గుడికి వెళ్లారనీ, ఆయన కూడా క్షుద్రపూజలు చేశారా?అని అడిగారు. క్షుద్రపూజలు చేసి రాహుల్‌‌గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ ‌నాయకులకు సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సంపత్ కుమార్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సంపత్‌‌కుమార్‌‌ను, వంశీచంద్‌‌రెడ్డిని రేవంత్‌‌రెడ్డి ఓడించారని ఆరోపించారు. అద్దంకి దయాకర్‌కు నోటి దురుసు ఎక్కువ అందుకే తుంగతుర్తి ప్రజలు రెండు సార్లు తిరస్కరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి డస్ట్ బిన్‌లో వెయ్యాలని ప్రజలు ఆలో‌చిస్తున్నారని చెప్పారు. కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ కాంగ్రెస్‌ అవినీతినీ బయట పెడుతున్నారు కాబట్టే ‌బీఆర్‌ఎస్‌ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా‌రని అన్నారు. సంపత్ కుమార్, అద్దంకి దయాకర్‌‌కు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ‌నాయకులు రాంబల్ నాయక్, తుంగబాలు, శరత్, యాదయ్య గౌడ్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -