- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ఈనెల 24న కర్నూలు జిల్లా లో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో మృతిచెందిన చందన మంగ, సంధ్యారాణి(హైదరాబాద్), మేఘనాథ్(కోదాడ), అనూష(నల్గొండ), బొంత ఆదిశేషగిరిరావు(హైదర్గూడా), కెనుగ దీపక్ (రాయగడ్) కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశాల మేరకు ఆదివారం ఆర్డిఓ అలివేలు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డిపిఓ నాగేంద్రం, ఎర్రవల్లి తహసిల్దార్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



