- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలోని శబరిమల ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. క్యూలైన్‌లో నిలబడి ఉన్న సథి (58) అనే మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఆలయ సిబ్బంది స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సథి ప్రాణాలు విడిచింది. మృతురాలు కోజికోడ్‌లోని కోయిలాండి గ్రామానికి చెందినది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



