Friday, September 4, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్‌ ఛప్రాలో ఉద్రిక్తత..యువతపై పోలీసుల లాఠీచార్జ్

బీహార్‌ ఛప్రాలో ఉద్రిక్తత..యువతపై పోలీసుల లాఠీచార్జ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌ ఛప్రాలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ఢిల్లీ యువత ఆందోళనలకు మద్దతుగా చేపట్టిన ధర్నాలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీగా తరలించిన యువతను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందిన వెంటనే, సరన్ జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాస్తవ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) వినీత్ కుమార్‌తో సహా ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ, శాంతిభద్రతల పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలో జనశక్తి జనతా దళ్ (JJD) జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత నిరసన సందర్భంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -